Friday, April 26, 2024

కళ్ల ఎదుటే ప్రాణాలు విడుస్తున్నా చలించని భర్త..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రాజేంద్రనగర్: కడదాక తోడుంటానని ప్రమాణం చేసి కట్టుకున్న భర్తే తన భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించాడు. భర్త వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పైశాచిక ఆనందం పొం దాడు తప్ప కాపాడే ప్రయత్నం చేయని ఓ కసాయి ఉదంతమిది. స్థానికంగా పలువురుని కంటతడిపెట్టించిన ఈసంఘటన శుక్రవారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం … ఎంఎం పహాడీలో నివాసం ఉండే మహ్మద్ సాజీద్, షభానాబేగం భార్య, భర్తలు. వీరికి ఐదు మంది ఆడ పిల్లలు సంతానం. కాగా సాజీద్ స్థానికంగా ఉండే ఓ టెంట్ హౌస్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలా వారీ జీవిత సాఫిగానే కొనసాగుతున్న తరుణంలో కొంతకాలంగా సాజీద్ మద్యానికి బానిసగా మారాడు. నిత్యం ఫుల్‌గా తాగి ఇంటికి వచ్చేవాడు. మత్తులో భార్యతో గొడవపడుతూ అందరు ఆడపిల్లలనే కన్నావంటూ వేధించేవాడు.

మగపిల్లలు ఎందుకు పుట్టలేదంటూ సూటిపోటి మాటలు అనేవాడు. మానసికంగానే కాకుండా శారీరకంగా షభానా బేగంను వేధించడం మొదలు పెట్టాడు. దాంతో కట్టుకున్న వాడే నిత్యం నరకం చూసిస్తూంటే ఇక ఈ జీవితం వద్దనుకుంది. ఈనేపథ్యంలో పలుమార్లు భర్తతో తాను వేధింపులు తట్టుకోలేనని, ప్రాణాలైన విడిచేస్తానంటూ చెప్పింది. అయినా ఏ మాత్రం అదరని, బెదరని సాజీద్ భార్యను వేధించడం మరింతగా చేయసాగాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన షభానాబేగం ఇంట్లో భర్త ముందే పురుగుల మందు సేవించించి అపస్మారక స్థితికి చేరింది. అయినా కనికరం లేని భర్త కనీసం ఆస్పత్రికి తీసుకువెళ్లి కాపాడే ప్ర యత్నం చేయకపోగా, పిల్లలు తల్లిని ఆ స్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేసి గదిలో బందించాడు. దాంతో పరుగుల మందు సేవించిన షబానాబేగం మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని శవ పంచనామ నిర్వహించి షబానా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలు పిల్లలు, కుంటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాజీద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును రాజేంద్రనగర్ పోలీస్ దర్యాప్తు చేస్తున్నారు.

Wife suicide as husband harassment in Rajendra Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News