Friday, May 3, 2024

గెలవడమంటే చాలా ఇష్టం

- Advertisement -
- Advertisement -

Winning is something that gives kick to any Hero or Heroine

 

గెలుపు అనేది ఏ హీరో, హీరోయిన్‌కు అయినా కిక్ ఇచ్చే విషయమే. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ఎదిగిపోయి ఎంతో మంది భామలకు ఆదర్శప్రాయమై పోయింది ప్రియాంక చోప్రా. “ఒకసారి విజయం సాధించామని అనిపిస్తే ముందు అనుకున్నది సాధించినట్లే. నాకు గెలవడమంటే చాలా ఇష్టం. ఎందులోనైనా నేను ఒకసారి గెలిచానంటే… ఆతర్వాత దాని గురించి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించను. ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్స్ నిర్దేశించుకొని వాటివైపు ప్రయాణిస్తా”అని చెప్పింది ప్రియాంక. కెరీర్ ప్రారంభంలో ఎంతో కష్టపడ్డ తాను పట్టుదలతో అనుకున్నది సాధించి టాప్ హీరోయిన్‌గా ఎదిగానని ఆమె పేర్కొంది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లడంతో తన ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పింది ప్రియాంక చోప్రా. ఇక తన డ్రెస్సింగ్ గురించి కామెంట్లు చేసేవాళ్లకు గట్టిగా బదులిచ్చింది ఈ భామ. సముద్రంలోకి దిగి స్విమ్ చేయాల్సినప్పుడు చీర కట్టుకొని దిగలేం కదా అని ఆమె ప్రశ్నించింది. ఎక్కడ ఏ డ్రెస్ సౌకర్యంగా ఉంటుందో అదే వేసుకుంటామని ప్రియాంక పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News