Monday, May 6, 2024

గెలిచి నిలిచిన కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

గెలిచి నిలిచిన కోల్‌కతా
టోర్నీ నుంచి రాజస్థాన్ ఔట్

IPL 2020: KKR Win by 60 Runs against RR

దుబాయి: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన కొల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 60 పరుగుల తేడాతో రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను కాపాడుకుంది. కాగా, ప్లేఆఫ్ ఛాన్స్ కోసం కోల్‌కతా మంగళవారం హైదరాబాద్‌ముంబై మ్యాచ్ వరకు వేచి చూడక తప్పదు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది. కెప్టెన్ మోర్గాన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో కోల్‌కతాను ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన మోర్గాన్ 35 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ (36), త్రిపాఠి (39), రసెల్ (25) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. కమిన్స్ నాలుగు, చక్రవర్తి నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. రాజస్థాన్ జట్టులో బట్లర్ (35), తెవాటియా (31), గోపాల్ (23) మాత్రమే కాస్త రాణించారు.

IPL 2020: KKR Win by 60 Runs against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News