Wednesday, May 1, 2024

నకిలీ బంగారంతో మోసం చేస్తున్న మహిళ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రూ.5,80,000 నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సంతోష్ నగర్ ఇన్స్‌స్పెక్టర్ శివచంద్ర

మనతెలంగాణ, సిటిబ్యూరోః  నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెడుతూ మోసం చేస్తున్న మహిళను సంతోష్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.5,80,000 నగదు, బురకా, నకిలీ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని కాలాపత్తర్, రామ్‌నాసాపుర, ఆలీబాగ్‌కు చెందిన రబీనా బేగం అలియాస్ రబీనా హౌస్ వైఫ్. పలువురిని నకిలీ బంగారు ఆభరణాలతో మోసం చేయడంతో చార్మినార్, షాలిబండ, సంతోష్‌నగర్, దబీర్‌పుర, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, అంబర్‌పేట, ఎల్‌బి నగర్, ఫలక్‌నూమ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ నెల 15వ తేదీ సాయంత్రం సమయంలో రబీనా బేగం బురఖా ధరించి జూవెల్లరీ షాపుకు వెళ్లింది. తన పేరు యాస్మిన్ బేగం అని అర్జంట్‌గా డబ్బులు అవసరం ఉందని, తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు పెట్టుకుని వడ్డీకి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరింది. దానికి జూవెల్లరీ షాపు వారు అంగీకరించడంతో బంగారు ఆభరణాలు వారికి ఇచ్చింది. వాటిని పరిశీలించిన సిబ్బంది అసలు బంగారుఆరణాలుగా చేప్పడంతో రెండు లక్షలు ఇస్తామని చెప్పారు. దానికి రూ.2 వడ్డీ అని చెప్పడంతో రూ.1.5 వడ్డీకి డబ్బులు ఇవ్వాలని కోరింది.

అది సాధ్యం కాదని వారు చెప్పడంతో బ్యాగులో బంగారు ఆభరణాలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లింది. తర్వత తిరిగి జూవెల్లరీ షాపుకు వచ్చి బంగారు ఆభరణాలు ఇచ్చి రూ.2లక్షలు అప్పుగా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత జూవెల్లరీ షాపు వారు బంగారు ఆభరణాలు పరిశీలించగా నకిలీ వని తేలింది. వెంటనే సంతోష్‌నగర్ పోలీసులకు కిలాడీ లేడీపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలిని విచారణ చేయగా గతంలో ఇలాంటి నేరాలు ఏడు చేసినట్లు ఒప్పుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News