Friday, April 26, 2024

పోర్న్ వీడియోలు చూడాలంటూ బలవంతం చేశాడు..

- Advertisement -
- Advertisement -

ముంబయి: తనను కమిషన్ ఇవ్వాలని బెదిరించడమే కాక పోర్న్ వీడియోలు చూడాలంటూ ఒత్తిడి తీసుకువచ్చాడంటూ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ఒక మహిళా కొరియోగ్రాఫర్ మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు, అంబోలి పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్(ఐఎఫ్‌టిసిఎ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత గణేష్ ఆచార్య 33 ఏళ్ల బాధిత మహిళను తరచు అంధేరీలో ఉన్న ఐఎఫ్‌టిసిఎ ఆఫీసుకు, ముక్తి రిహార్సల్ హాలుకు రమ్మని పిలిచేవాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సినిమా పాటలకు కొరియోగ్రాఫ్ చేసేందుకు డ్యాన్సర్లను సమన్వయపరిచే వృత్తిలో ఉన్న తనను డ్యాన్సర్‌కు రూ. 500 చొప్పున కమిషన్ చెల్లించాలని ఆచార్య డిమాండు చేసే వాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. అయితే తాను ఇందుకు నిరాకరించడంతో తనకు బాలీవుడ్‌లో పని లేకుండా చేశాడని ఆమె తెలిపింది. ఆ తర్వాత తనకు అసిస్టెంట్‌గా పనిచేయమని అతను ఒత్తిడి చేశాడని, తాను అందుకు అంగీకరించలేదని ఆమె వివరించింది. తాను గణేష్ ఆచార్య ఆఫీసుకు వెళ్లినప్పుడల్లా అతను పోర్న్ వీడియోలు చూస్తూ కనిపించేవాడని, తనను కూడా వాటిని చూడాలంటూ బలవంతం పెట్టేవాడని ఆమె ఆరోపించింది. అతను స్త్రీలోలుడేకాక జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటివి కూడా చేసేవాడని ఆమె ఆరోపించింది. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు గణేష్ ఆచార్యపై ఫిర్యాదు చేసేందుకు తాను ఐఎఫ్‌టిసిఎ ఆఫీసుకు వెళ్లగా అక్కడకు జయశ్రీ కేల్కర్, ప్రీతి లాడ్‌తో కలసి ఆచార్య వచ్చాడని, తనను దుర్భాషలాడుతూ వారంతా చేయిచేసుకున్నారని ఆమె ఆరోపించింది.

Woman files complaint against Bollywood choreographer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News