Wednesday, May 1, 2024

బిజెపి వారి నుంచి మహిళల భద్రతను ఆశించలేం: రాహుల్

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi

ఉత్తరప్రదేశ్ దళితుల అత్యాచారాలపై బిజెపిని నిలదీసిన రాహుల్.
ఇద్దరు దళిత మైనర్స్ సోదరీమణులు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలోని చెరకు తోటలో చెట్టుకు ఉరి.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు దళిత బాలికలను కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం బిజెపిపై విరుచుకుపడ్డారు, రేపిస్టుల విడుదలకు సహకరించే వారి నుండి మహిళల భద్రతను ఆశించలేమని అన్నారు. ఇద్దరు టీనేజ్ సోదరీమణులు బుధవారం లఖింపూర్ ఖేరీలోని నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారి ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న చెరకు తోటలోని చెట్టుకు ఉరివేసుకుని కనిపించారని పోలీసులు తెలిపారు. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఆరుగురిని గురువారం అరెస్టు చేశారు.

“పట్టపగలు లఖింపూర్‌లో ఇద్దరు మైనర్ దళిత సోదరీమణులను కిడ్నాప్ చేసి హత్య చేయడం చాలా ఆందోళన కలిగించే సంఘటన” అని రాహుల్ గాంధీ హిందీలో చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దళిత బాలికలను హత్య చేసినట్లు ఆరోపించిన వార్త వెలువడిన వెంటనే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో మహిళలపై “పెరుగుతున్న” నేరాలపై బిజెపి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లఖింపూర్ (యూపీ)లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల హత్యలు హృదయ విదారకంగా ఉన్నాయని.. పట్టపగలు బాలికలను అపహరించినట్లు బంధువులు చెబుతున్నారని ప్రియాంక గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.

‘‘ప్రతిరోజూ వార్తాపత్రికలు,టెలివిజన్లలో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు మెరుగుపడవు. అసలెందుకు ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై క్రూరమైన నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి?” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News