Wednesday, May 15, 2024

మహిళల టీ20 ప్రపంచకప్: సెమీ ఫైనల్ లో భారత్ ప్రత్యర్థి ఎవరంటే?

- Advertisement -
- Advertisement -

 

ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు లీగ్ లో జరిగిన అన్ని మ్యాచ్ లను గెలిచి ఇప్పటికే సెమీస్ కు దూసుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ నాకౌట్ సెమీస్ చేరుకున్నాయి.  దీంతో సెమీస్ లో భారత్ తో తలపడే ప్రత్యర్థి జట్టుపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన సఫారి జట్టు అగ్రస్థానంలో నిలువగా, మాజీ చాంపియన్ ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో సెమీస్ లో భారత్ ప్రత్యర్థి జట్టు ఖరారైంది. గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎలో మొదటి స్థానంలో నిలిచిన టీమిండయాను ఢీకొట్టనుంది. దీంతో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపుడనున్నాయి. 2017 జరిగిన టోర్నీలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అప్పుడు భార‌త్‌ను ఓడించి ఇంగ్లాండ్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ఈసారి మాత్రం ఇంగ్లాండ్ జట్టుపై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ కు చేరుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఇక, గ్రూప్ ఎలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా జట్టు తలపడనుంది.

Womens T20 World Cup: INDW vs ENGW First Semi Final

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News