Saturday, April 27, 2024

ఆ సత్తా విరాట్‌కు ఉంది: హర్భజన్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియాకు ప్రపంచ కప్ సాధించి పెట్టే సత్తా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఉందని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. కోహ్లి సారధ్యంలో భారత్ త్వరలోనే ప్రపంచకప్‌ను ముద్దాడుతుందనే నమ్మకాన్ని హర్భజన్ వ్యక్తం చేశాడు. కోహ్లిలో అపార నాయకత్వ ప్రతిభ దాగివుందన్నాడు. అనతి సారధ్యంలో టీమిండియా సాధించిన చారిత్రక విజయాలే దీనికి నిదర్శనమన్నాడు. రానున్న రెండు మూడేళ్లలో జరిగే ప్రపంచకప్ ట్రోఫీలలో భారత్ విజేతగా నిలువడం ఖాయమన్నాడు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ మరోసారి విశ్వ విజేతగా నిలుస్తుందనే నమ్మకం తనకుందన్నాడు. అతని దూకుడు నిర్ణయాలే టీమిండియా అగ్రశ్రేణి జట్టుగా మారేందుకు దోహదం చేసిందన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చివరి వరకు పోరాడే తత్వం కోహ్లి సొంతమన్నాడు. అందుకే విదేశాల్లో కూడా కోహ్లి సారధ్యంలో మంచి విజయాలు లభిస్తున్నాయన్నాడు. ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా అతని కెప్టెన్సీలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని హర్భజన్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News