Sunday, May 12, 2024

ప్రపంచ వేదికపై భారత్‌కు అవమానం

- Advertisement -
- Advertisement -

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సస్పెన్షన్ వేటు
ఉత్తర్వులు జారీ చేసిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్
న్యూఢిలీ : ప్రపంచ వేదికపై భారత్‌కు ఘోర అవమానం జరిగింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందు న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై యునైటెడ్ వరల్డ్ రెజ్లిం గ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నిర్ణయం గురువారం నుంచే త క్షణమే అమలులోకి వచ్చేలా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆదేశాలు జారీ చే సింది. కాగా, భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఈ ఏడాది జూన్ నెల లో ఎన్నికలు జరగాల్సి ఉండగాపలువురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్‌కి వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఆందోళనకు దిగారు.

భారతీయ రెజ్లర్లు వరుస నిరసనలు తార స్థా యికి చేరడం, ఇందులో వివిధ రకాల రాజకీయ పార్టీలు కావడంతో ఈ వివాదం కాస్త చినికి చినికి గాలి వానలాగా మారింది. దీం తో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. మరోవైపు బ్రిజ్ భూ షణ్ తాను దేనికైనా సిద్ధమే అని వ్యాఖ్యలు చేయడం తో ఒక్కసారిగా రెజ్లర్లు వెనక్కి తగ్గారు. ఇది లా ఉండగా రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేస్తున్నామని ఒలింపిక్ కమిటీ ఆదేశాలు ఇచ్చింది, కానీ, ఇప్పటి వరకూ ఎన్నికలు నిర్వహించ లేదు. ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను యునైటెడ్ వరల్డ్ సస్పెండ్ చేయడంతో రాబోయే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లలో భారత రెజ్లర్లు పోటీ పడలేరు. దీంతో తటస్థ రెగ్యుల ర్గా వాళ్ళు పోటీకి దిగాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ మూడో వా రం నుంచి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగా ల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలాగా భారత ఒలంపిక్ సంఘం తాత్కాలిక ప్యానెల్ ని యమించిన ట్లు తెలుస్తోంది. అడ్ హాక్ కమిటీ గడువులోగా ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే యు నైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. ఈ మేరకు గడువులోగా ఎన్నికలు నిర్వహించని కారణంగా రెజ్లిం గ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సస్పెన్షన్ విధిస్తున్నట్టు బుధవారం రాత్రి అడ్ హాక్ కమిటీకి సమాచారం ఇచ్చినట్టు భారత ఒలంపిక్ వెల్లడించింది. ఇక భారత రెజ్లింగ్ సమాఖ్యలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఈ ఏ డాది ప్రారంభంలో ఢిల్లీలో జరగాల్సిన ఆసియా రెజ్లింగ్ ఛాం పియన్ షిప్ 2023 ను కజకిస్తాన్లోని ఆస్తానాకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News