Monday, April 29, 2024

భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు

- Advertisement -
- Advertisement -

కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య పాలక వర్గంపై భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్య.. నియమ నిబంధనలను పట్టించుకోనందుకుగాను క్రీడా మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది. సమాఖ్య అధ్యక్షుడిగా రెండు రోజుల క్రితం సంజయ్ సింగ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన బ్రిజ్ భూషణ్  లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ రెజ్లర్లు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం బ్రిజ్ భూషణ్ ని పదవినుంచి దింపి, సమాఖ్యకు తాజాగా ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ కూడా బ్రిజ్ భూషణ్ అనుచరుడే కావడంతో.. అందుకు నిరసనగా ఒలింపిక్ పతక విజేత సాక్షిమాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పింది.

ఇదిలా ఉండగా సంజయ్ సింగ్ తాజాగా ఒక ప్రకటన చేస్తూ అండర్ 16, అండర్ 20 జాతీయ రెజ్లింగ్ పోటీలు ఈ నెలఖారులోగా ఉత్తరప్రదేశ్ లోని నంది నగర్ లో జరుగుతాయని ప్రకటించారు. ఈ ప్రకటన రెజ్లర్లలో కలకలం రేకెత్తించింది. జాతీయ పోటీల్లో పాల్గొనే రెజ్లర్లకు తగినంత వ్యవధి ఇవ్వకుండా ఏకపక్షంగా ఇలా తేదీలను ప్రకటించడం సమాఖ్య నిబంధనలకు విరుద్ధమని క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చిన సమాఖ్య పాలకవర్గంపై సస్పెన్షన్ వేటు వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News