Sunday, May 12, 2024

తెరపైకి యశ్వంత్ సిన్హా

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి అభ్యర్థి ఖరారుకు నేడు ప్రతిపక్షాల భేటీ ఇంతకు ముందే నో
చెప్పిన పవార్, ఫరుఖ్ అబ్దుల్లా మరో అభ్యర్థి కోసం ముమ్మరంగా అన్వేషణ

రాష్ట్రపతి రేసులో నిలబడడానికి నిరాకరించిన గోపాలకృష్ణగాంధీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి పదవికి ఏకాభిప్రాయ అభ్యర్థి ఎంపికకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ లు మంగళవారం (నేడు) సమావేశం కానున్నాయి. రాష్ట్రపతి పదవి బరిలో నిలిచేందుకు ఇప్పటికే శరద్ పవార్, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా నిరాకరించారు. తాము పోటీ చేయబోమని సున్నితంగానే ప్రతిపక్షాల ఆఫర్‌ను తోసిపుచ్చారు. ఇప్పుడు గోపాల కృష్ణ గాంధీ కూడా ప్రతిపక్షాల విజ్ఞప్తిని కాదన్నారు. తాను బరిలోకి దిగే అవకాశం లేదని సోమవారం ప్రతిపక్ష నేతలకు తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ అ యిన గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ మనవడు. వరుసగా ముగ్గురు ప్రముఖులు రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష అభ్యర్థిగా నిలిచేందుకు విముఖత తెలియచేయడంతో ఉమ్మడి అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాలు తిరిగి తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయాల్సివచ్చింది. బిజెపి సారథ్యపు ఎన్‌డిఎ అభ్యర్థితో తలపడేందుకు ప్రతిపక్ష పార్టీలందరికి ఆమోదయోగ్య నేత ఎంపికకు కసరత్తు జరుగుతోంది. అయితే ఇది ఇప్పటికీ వీడ ని చిక్కు ముడిగా మారింది. ఈ దశలో అభ్యర్థి ఎవరు? ఏ విధంగా ఎంచుకోవా ల? ఎంచుకున్న వారిని ఏ విధంగా ఒప్పించాలనే అంశాన్ని చర్చించేందుకు ప్రతిపక్షాలు నేడు సమావేశం అవుతాయి. ఎన్‌సిపి నేత పవార్, కశ్మీర్ మాజీ సిఎం , అత్యంత సీనియర్ పార్లమెంటేరియన్

పార్లమెంటేరియన్ ఫరూక్ అబ్దుల్లాల దిశలో ప్రతిపక్షాలు ఎంపికకు యత్నించాయి. అయితే ఇది నెరవేరలేదు. దీనితో 77 ఏండ్ల మాజీ ఉన్నతాధికారి , గతంలో శ్రీలంక , దక్షిణాఫ్రికాలలో హై కమిషనర్‌గా పనిచేసిన గోపాల కృష్ణ గాంధీని ఒప్పించేందుకు ప్రతిపక్ష నేతలు యత్నించారు. ఆయన గాంధీకి, సి రాజగోపాలాచారి(రాజాజీ)కి కూడా మనవడు. పైగా విశేష పరిపాలనా అనుభవం ఉంది. 2017లో ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష ఉమ్మడి అ భ్యర్థిగా వెంకయ్యనాయుడుతో పోటీకి దిగారు. అయితే ఓడారు. ఇప్పు డు అత్యున్నత పదవికి పోటీకి దిగడం కుదరదని ఆయన సోమవా రం ప్రకటించడంతో ప్రతిపక్ష అభ్యర్థి అన్వేషణ ఆగని ప్రక్రియ అయింది.

నేతల అభ్యర్థనకు ఔననలేను : గాంధీ

తాను రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా రావాలని పలువురు నేతలు ఆహ్వానించడం తనకు గర్వకారణంగా ఉందని, ముందుగా వారికి తాను ధన్యవాదాలు తెలియచేస్తున్నానని గోపాలకృష్ణ గాంధీ తెలిపారు. తాను వారి అభ్యర్థనను అన్ని విధాలుగా పరిశీలించాను, వివిధ కోణాలలో చూశానని ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థి అంటే కేవలం ప్రతిపక్షాల మధ్య సమ్మతి దక్కిన అభ్యర్థి అయితే సరిపోదు. అంతకు మించి జాతీయ స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యత దక్కే వ్యక్తి అవసరం. ఈ కోణంలో ప్రతిపక్ష ఐక్యతను దీనితో పాటు జాతీయ స్థాయి సానుకూల వాతావరణాన్ని కల్పించుకోవల్సి ఉంటుంది, ఇటువంటి వ్యక్తికి అవకా శం కల్పించాలని విపక్ష నేతలకు విజ్ఞప్తి చేశానని గాంధీ వివరించారు.

తెరపైకి యశ్వంత్ సిన్హా పేరు?

కోల్‌కతా : రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ప్రతిపాదనలోకి వచ్చింది. ఆయనను బరిలోకి దిగేలా చేసేందుకు బిజెపియేతర పార్టీలన్ని యత్నిస్తున్నాయి. గత ఏడాది ఆయన మమతా బెనర్జీ నాయకత్వపు టిఎంసిలో చేరారు. ఇంతకు ముందు బిజెపిలో సీనియర్ నేత అయిన 85 ఏండ్ల సిన్హా ఆ తరువాత మోడీతో విభేదించి పార్టీ వీడారు. చాలా కాలంగా సిన్హా ప్రతిపక్ష తరఫు రాష్ట్రపతి సీనియర్ తురుఫు ముక్క అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన పేరును సోమవారం పలువరు నేతలు ఫోన్ల ద్వారా మమత బెనర్జీ ముందుకు ప్రధానంగా తెరపైకి తీసుకువచ్చారు. ఆమెకు కూడా సిన్హాను పోటీకి దింపాలనే ఆలోచన ఏర్పడింది. మంగళవారం జరిగే ప్రతిపక్ష పార్టీల భేటీలో సిన్హా పేరును మమతనే ప్రస్తావించే అవకాశం ఉంది. దీనికి ప్రతిపక్ష ఇతర నేతలు సమ్మతిస్తే సిన్హాను ఒప్పించేందుకు యత్నిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News