Friday, May 3, 2024

ఆందోళ‌న అవసరం లేదు.. డిపాజిటర్ల సొమ్ముకు భద్రత ఉంది

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: ఎస్ బ్యాంకులో ఉన్న అన్నీ డిపాజిట్లకు పూర్తి భద్రత ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్ బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ బ్యాంకు సంక్షోభాన్ని నివారించేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. డిపాజిట‌ర్ల సొమ్ము భద్రంగా ఉందని, ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. బుధవారం నుంచి ఎస్ బ్యాంకుపై మారటోరియం ఎత్తివేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఎస్ బ్యాంకు సేవలు పున:ప్రారంభం కానున్నాయని, 26న కొత్త బోర్డును నియమించనున్నట్లు తెలిపారు. బ్యాంకులు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ, దేశీయ ఎకానమీ పతనమైందన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్, ఫార్మా, సేవ రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, దేశ ఆర్థిక మందగమనం మరింత పెరిగే అవకాశం ఉందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

Yes Bank Depositors Money safe: RBI Governor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News