Sunday, April 28, 2024

జెసి  ఫ్లవర్స్ తో ఏఆర్సిని ఏర్పాటు చేయనున్నయెస్ బ్యాంక్

- Advertisement -
- Advertisement -

 

Yes Bank ARC

కోల్ కతా: రూ. 48,000 కోట్ల విలువైన బ్యాంకు మొండి బాకీలను విక్రయించడానికి అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీని(ARCని) ఏర్పాటు చేయడానికి జెసి  ఫ్లవర్స్ ను  యెస్ బ్యాంక్ భాగస్వామిగా ఎంపిక చేసింది. బ్యాంకు బకాయిలను వసూలు చేయడానికి యెస్ బ్యాంక్ జెసి ఫ్లవర్స్ తో బైండింగ్ టర్మ్ షీట్ పై సంతకం కూడా చేసింది. అవసరమైన ముందస్తు షరతులను పూర్తి చేసిన తర్వాత, టర్మ్ షీట్ జూలై 15, 2022 నుండి అమల్లోకి వస్తుందని యెస్ బ్యాంక్ శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. “తదనుగుణంగా, బ్యాంకు యొక్క గుర్తించబడిన వసూలు కాని రుణాల పోర్ట్‌ఫోలియోను రూ. 48,000 కోట్ల వరకు ప్రతిపాదిత విక్రయానికి జెసి ఫ్లవర్స్  ఏఆర్ సి  బేస్ బిడ్డర్‌గా ఉంటుందని బ్యాంక్ నిర్ణయించింది” అని ఆ ఫైలింగ్ లో  పేర్కొంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, జెసి  ఫ్లవర్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీని(ARCని) యొక్క బిడ్‌ను బేస్ బిడ్‌గా ఉపయోగించి అటువంటి పోర్ట్‌ఫోలియో అమ్మకం కోసం ‘స్విస్ ఛాలెంజ్’ ప్రాతిపదికన పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియను అమలు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు యెస్ బ్యాంక్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News