Wednesday, May 15, 2024

యువతి మానాన్ని కాపాడిన శునకం…

- Advertisement -
- Advertisement -

Young women save from rape by Dog

అమరావతి: శునకం(కుక్క) విశ్వాసానికి మారు పేరంటారు. ఒక్కసారి దాన్ని చేరదీస్తే జీవితాంతం రుణపడి ఉంటుందని చెబుతారు. యజమాని కూతురుపై కామాంధుడు అత్యాచారం చేయబోతుండగా శునకం కాపాడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని గొల్ల‌ప‌ల్లె గ్రామంలో జరిగింది. పోలీసులుత తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువతి (17) తన ఇంటి డాబాపై నిదిస్తుండగా ఓ యువకుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో యువతి కేకలు వేయడంతో కుక్క వెంటనే అప్రమత్తమైంది. యువకుడితో వీరోచితంగా పోరాటం చేసింది. కుక్క అతడిని కరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి దొరకలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News