Home తాజా వార్తలు హుజూర్‌నగర్‌లో పర్యటించిన షర్మిలమ్మ

హుజూర్‌నగర్‌లో పర్యటించిన షర్మిలమ్మ

YS Sharmila To Visit HuzurNagar

హుజూర్‌నగర్‌ః దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిలమ్మ బుధవారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. మొదటగా నేరేడుచర్ల మండలంలోని మేడారంలో పర్యటించారు. మేడారం నుండి హుజూర్‌నగర్‌కు చేరుకున్న షర్మిల ఇందిరాసెంటర్‌లో ఉన్నటువంటి తనతండ్రి వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. హుజూర్‌నగర్ నుండి చింతలపాలెం మండలంలోని దొండపాడులో ఇటీవలె మృతిచెందిన ఎక్సైజ్‌శాఖ మాజీ ఐ.జి గున్నం నాగిరెడ్డి నివాసానికి చేరుకుని నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మేళ్ళచెర్వు మండలం రామాపురం మీదుగా హైదరాబాద్ లోని లోటస్‌ఫాండ్‌కు తిరిగివెళ్ళారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టిపి నియోజకవర్గం ఇన్‌చార్జీ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, మేరెడ్డి యల్లారెడ్డి, దొంతగాని రాజారమేష్‌గౌడ్, శాసనాల అంజి, చారి, కోటి, రామారావు, అహ్మద్, శివారెడ్డి, నరసింహారెడ్డి, హసన్, నాని, రవి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

YS Sharmila To Visit HuzurNagar