- Advertisement -
హైదరాబాద్: మరోసారి హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వరద నీరు రోడ్లపైకి చేరుకోవడంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి ఇంకా తెరుకోని నగర ప్రజలు.. మళ్లీ వర్షం కురుస్తుండడంతో భయాందోళనలకు గురవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rainfall in Hyderabad for next 3 days
- Advertisement -