Saturday, April 27, 2024

మణిపూర్ మారణహోమం అదుపు చేయాలి : టిఎస్ యుటిఎఫ్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :మణిపూర్‌లో ఆదివాసీలు,మహిళలపై జరుగుతున్న హత్యలు,అత్యాచారాలను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) తీవ్రంగా ఖండించింది. శనివారం యూనియన్ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొంటూ దేశ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన మణిపూర్ రాష్ట్రంలో గత 50 రోజులుగా జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణలను తక్షణమే నివారించాలని, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుకీ ఆదివాసీలు, మైదాన ప్రాంత మైటీలకు మధ్య జరుగుతున్న ఘర్షణలకు ఆజ్యం పోసి చోద్యం చూస్తున్న కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా ఆది, సోమవారాల్లో జిల్లా, డివిజన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఈసంఘం అధ్యక్షుడు కె. జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. సామాజిక స్పృహ కలిగిన ఉపాధ్యాయులంతా ఈ ప్రదర్శనల్లో పాల్గొనాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News