Saturday, April 27, 2024

మెక్సికోలో కాల్పులు.. 10మంది మృతి

- Advertisement -
- Advertisement -

మెక్సికో: మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలో ఓ సాయుధ ముఠా జరిపిన కాల్పుల్లో 10మంది చనిపోయారు. శనివారం ఓ వ్యాన్‌లో వచ్చిన దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరపగా 10మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళ, ఇద్దరు బాలురు గాయపడ్డారు. ఇటీవలి సంవత్సరాల్లో జలిస్కోలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్ర రాజధాని గ్వాడాలజారాలోని ఓ వర్గంతో జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే సాయుధ ముఠా ఘర్షణ పడుతోంది.

10 killed in shooting attack in Mexico

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News