Friday, April 26, 2024

ఉత్తర కొరియాలో 10 లక్షలు దాటిన కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -


సియోల్ : ఉత్తర కొరియాలో కొవిడ్ తొలి కేసు బయటపడిన రోజుల వ్యవధి లోనే ఇక్కడ బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. భారీగా పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో లక్షణాల ఆధారం గానే కొవిడ్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కొరియాలో సరైన ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం, వ్యాక్సినేషన్లు వేయకపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ విధించారు. ఇటీవల ఉత్తర కొరియా అధినేత కిమ్ ఎమర్జెన్సీ పొలిట్ బ్యూరో మీటింగ్ నిర్వహించారు. దీనిలో ఔషధ సరఫరాలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. దీంతో ఉత్తర కొరియా సైన్యంలో మెడికల్ కోర్‌ను రంగం లోకి దింపింది. ప్యాంగాంగ్ నగరానికి ఔషధ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News