Saturday, April 27, 2024

గుడ్ న్యూస్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః యుద్ద ప్రాతిపదికన ఖాళీ పోస్టుల భర్తికి చర్యలు చేపడుతున్నామని, అభ్యర్థులు పరీక్షల గురించి ఆలోచించకుండా సన్నద్దం కావాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రం వద్ద నిర్వహించిన సింగరేణి మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హజరై సింగరేణిలోని 441 మంది కారుణ్య నియమాక ప్రతాలు అందచేశారు. తమది ప్రజా ప్రభ్వుత్వమని, ఒక్కో సమస్య పరిష్కరించుకుంటూ ముందుకు పోతోందన్నారు. ఒక కుటుంబంలో నలుగురి ఉద్యోగాలు ఊడగొడితే 441 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ ప్రక్రియ ఇంతటితో ఆగదని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రేస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. త్వరలో64 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు తెలంగాణ సాదనలో వైఫల్యం చెందినా కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు గత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని ఆయన అన్నారు. కే్ంరద్రం కూడా సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్ కు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి వుందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల అధికారంలో వున్న బిఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని సిఎం అన్నారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే తాను ఆదేశించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

కారుణ్య నియామకాల వయస్సు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. అనంతరం డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి కాలరీస్ నుఇందిరమ్మ రాజ్యంలో కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుంటుందని,ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల మానవీయంగా వ్యవహరిస్తుందన్నారు.కార్మిక హక్కులు కాపాడే విధంగా ప్రజా పాలన అందిస్తామని,తెలంగాణలో బొగ్గు బావులు సింగరేణికి ఉండేలా కేంద్రంతో మాట్లాడుతున్నామన్నారు. బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర గత ప్రభుత్వం చేసిందని,
సింగరేణి సంస్థలో 1.05 లక్షల ఉద్యోగాలను గత పాలకులు 42 వేలకు కుదించారని ఈ ఎన్నికల్లో తిరిగి వాళ్లే గెలిచి ఉంటే ఐదు వేల కు కుదించేవారేమో అంటూ ఎద్దేవా చేశారు.గత పాలనలో కార్మికులకు ద్రోహం చేసిన ప్రభుత్వాన్ని మార్చుకొని స్వేచ్ఛ, ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యమని మీ ఉద్యోగాల కోసం మీరు కాంగ్రెస్ ను గెలిపించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి కాలరీస్ సంస్థను గత ప్రభుత్వం తమ రాజకీయాలకు, స్వలాభం కోసం వాడుకున్నారని,పది సంవత్సరాలు పరిపాలించి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆయన ఆరోపించారు.ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజా ప్రభుత్వం రాగానే పారదర్శకంగా నియామకాలు చేస్తామని చెప్పామని అందులో భాగంగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా సింగరేణి సంస్థలో 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసి తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్న యువతీ యువకుల ఆశలు నిజం చేస్తామన్నారు.ఎల్బీ స్టేడియంలో ఒకే రోజు 7 వేల మంది నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టామని,నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇందిరమ్మ పరిపాలనలో నియామక ప్రక్రియ మొదలైందన్నారు.సింగరేణి సంస్థలోని ప్రతి వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని,నియామక పత్రాలు తీసుకున్న ఉద్యోగులందరినీ రాష్ట్ర సంపదగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నదన్నారు.స్వేచ్ఛ స్వతంత్రం భేషా జాలలు లేకుండా ప్రతి సమస్యపై సింగరేణి కార్మికులు గళమెత్తాలన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తిరిగి సంపూర్ణ స్వేచ్ఛను అందిస్తుమన్నారు.సింగరేణి ఉద్యోగాలకు గాని స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థను ఈ ప్రభుత్వం కాపాడుతుందని,సహజ వనరులు అందించి రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ భాగస్వామ్యం కావాలన్నారు.రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై గత రెండు నెలలుగా వక్ర భాష్యాలు మాట్లాడుతున్న వారి నుంచి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు.కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవా లక్ష్మీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి ఎండి బలరాం నాయక్, ఐ.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రటరీ జనప్రసాద్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News