Sunday, May 5, 2024

దేశంలో 50వేలకు చేరువలో కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో 1,694 పాజిటివ్ కేసులు నమోదుకాగా 126 మంది మృతి చెందారని కేంద్ర  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో భారత్ లో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కు పెరిగింది. వీటిలో ప్రస్తుతం 33,514 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,694 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

14,182 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. దేశంలో కరోనాతో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ కొత్త కేసులు తీవ్రత ఎక్కవ అవుతోంది. గడిచిన కొన్ని రోజులు సగటున 1000 పైగా కేసులు నమోదయ్యాయి. కానీ గడిచిన మూడు రోజులుగా దేశంలో గరిష్ఠంగా కరోనా కేసులు వస్తున్నాయి.

1694 new cases and 126 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News