Saturday, April 27, 2024

అమృత్‌సర్ వద్ద ఎన్‌కౌంటర్.. ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ల హతం

- Advertisement -
- Advertisement -

2 Gangsters Killed in Encounter in Amritsar

అమృత్‌సర్ వద్ద ఎన్‌కౌంటర్
ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ల హతం
వీరు మూసేవాలా హత్యలో నిందితులు
పాక్ సరిహద్దు దగ్గరే కాల్పులు
నాలుగు గంటలు భయకంపితమైన భక్నా
అమృత్‌సర్/చండీగఢ్: సిన్మా సన్నివేశాల తరహాలో పంజాబ్‌లో బుధవారం మధ్యాహ్నం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ హతులయ్యారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో నిందితులైన షూటర్లుగా వీరిని గుర్తించారు. వీరు గ్యాంగ్‌స్టర్లే కాకుండా, గ్యాంగ్ నాయకులని వీరిని జగ్రూప్ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నూ కుస్సాగా గుర్తించినట్లు ఆ తరువాత పంజాబ్ డిజిపి గౌరవ్ యాదవ్ విలేకరులకు తెలిపారు. అమృత్‌సర్‌కు సమీపంలోని భక్నా గ్రామం వద్ద పరస్పర కాల్పులు జరిగాయి. ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఘటన స్థలిలో ఓ ఎకె 47 రైఫిల్, ఓ పిస్టల్, భారీ సంఖ్యలో బుల్లెట్లు స్వాధీనపర్చుకున్నారని పంజాబ్ పోలీసు విభాగపు అనుబంధమైన యాంటి గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ ఎడిజిజిపి ప్రమోద్ బాన్ తెలిపారు. యకుడు మూసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. కాల్పుల్లో ఆరితేరిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలకు దిగుతున్నాయి. ఈ ప్రాంతంలో అనుమానితులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతోచాలా కాలం క్రితమే ప్రత్యేకంగా వెలిసిన గ్యాంగ్‌స్టర్ నిరోధకబృందం, పోలీసు బలగాలు అక్కడికి తరలివెళ్లాయి. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని పోలీసు బలగాలు హెచ్చరిస్తూ మైక్‌లలో చెపుతూ ఉండగానే పరస్పర కాల్పులతో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో కాల్పుల మోతలు విన్పించాయి. పరస్పర కాల్పుల దశలో ఓ న్యూస్ ఛానల్ కెమెరా మెన్‌కు కుడి కాలిలో బుల్లెటు గాయాలు అయ్యాయి. దీనితో ఆయన కిందపడ్డారు. పాకిస్థాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో, అమృత్‌సర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామంలో దాదాపు నాలుగు గంటల పాటు ఎన్‌కౌంటర్ సాగింది.

ముగ్గురు షూటర్లను పట్టుకునేందుకు సాగిన ఎన్‌కౌంటర్‌లో ప్రత్యేక బలగాలు ఇద్దరని మట్టుపెట్టగా, దీపక్ ముండి అనే మూడో వ్యక్తి సీన్ నుంచి పారిపొయ్యాడని డిజిపి గౌరవ్ తెలిపారు. మూసేవాలా హత్యకు సంబంధించి అనుమానంపై ఇప్పటికే ఎనిమిది మంది షూటర్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దులకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని ఈ ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు దిగ్బంధించాయి. ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఎన్‌కౌంటర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఈ సరిహద్దు ప్రాంతమే అయిన తరన్ తరన్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత 28 ఏండ్ల శుభ్‌దీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూసేవాలాను పంజాబ్‌లోని మన్సా జిల్లాలో ఆయన స్వగ్రామం మూసా వద్ద కాల్పులు జరిపి ఆగంతకులు కాల్చిచంపారు. వీరిలో తొలి రౌండ్ కాల్పులు జరిపిన మన్నూ కూస్సా ఇతరుల కోసం గాలింపు ఉధృతం అయింది. ఈ క్రమంలోనే అనుకోకుండా ఇద్దరు గ్యాంగ్‌స్టర్ నిరోధక బృందం వేటకు హతులయ్యారు.

2 Gangsters Killed in Encounter in Amritsar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News