Saturday, April 27, 2024

విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

3.05 Lakh Crores released to Electricity

ఢిల్లీ: విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు, ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా నిర్మలా మాట్లాడారు.  పిపిఎ పద్ధతి ద్వారా 2200 కోట్లతో ఏడు కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఉజ్వల స్కీమ్ కింద మరో 9 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని, ఇన్సూరెన్స్ రంగంలో భారీగా ఎఫ్‌డిఐలు, బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్‌డిఐలకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. బ్యాకింగ్ రంగంలో భారీ సంస్కరణలు ఉంటాయని, బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఎన్‌పిఎలు-మొండి బకాయిలు బ్యాడ్ బ్యాంకులకు తరలిస్తామని, బ్యాంకుల ఖాతాలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి సూచించారు.

ఐదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు, 11 వేల కిలో మీటర్ల జాతీయ రహదారుల కారిడార్ల నిర్మాణం చేపడుతామన్నారు. ఈ సంవత్సరం రైల్వేలకు లక్షా పది వేల కోట్లు కేటాయిస్తామని, ఖరగ్‌పూర్- విజయవాడ మధ్య ఈస్ట్‌కోస్ట్ సరకు రవాణా కారిడర్, ఈ ఏడాది రైల్వేలకు రూ.1.10 లక్షల కోట్లు, మెట్రో రైలు లైన్ అభివృద్ధికి రూ. 18 వేల కోట్లు, 2023 నాటికి రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి అవుతుందని నిర్మలా చెప్పారు. కోచి, చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, పుణే మెట్రో ప్రాజెక్టుల విస్తరణ కొనసాగుతుందన్నారు. మెట్రో లైట్, మెట్రో న్యూ పేరుతో ప్రాజెక్టులు ఉంటాయని, బెంగళూరులో మెట్రో విస్తరణకు 14 వేల 700 కోట్లు, చెన్నై మెట్రో విస్తరణకు 63 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. రూ.2.75 లక్షల కోట్లతో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ లక్ష్మి పథకం ఉంటుందని ఆమె తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయి. పెట్రో ఉత్పత్తులపై వ్యవసాయ సెస్ విధించారు. పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రిసెస్ విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News