Monday, April 29, 2024

ప్రభుత్వ ఆస్తులు గుత్త పెట్టుబడిదార్లకు అప్పగింత : రాహుల్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

Modi govt is trying to hand over government assets to investors: Rahul

 

న్యూఢిల్లీ : ప్రభుత్వ బడ్జెట్ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ తీవ్రంగా విమర్శిస్తూ నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను గుత్తపెట్టుబడిదారులకు అప్పగించడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. రెండు ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థ, తదితర ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా బడ్జెట్‌లో రూ.1.75 లక్షల కోట్లు సమకూరుతున్నట్టు ప్రభుత్వం చెబుతోందని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజల చేతికి డబ్బు అందించే విషయం విస్మరించి గుత్తపెట్టుబడిదారులకు ప్రభుత్వ ఆస్తులను అందచేస్తోందని విమర్శించారు. బడ్జెట్ ప్రవేశానికి ముందు రాహుల్ చిన్న, మధ్యతరహా సంస్థలకు, రైతులు, కార్మికులకు బడ్జెట్ సహాయం అందించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యభద్రతకు నిధులు పెంపు చేయాలని, సరిహద్దు రక్షణకు రక్షణ వ్యయం పెంపొందించాలని డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News