Wednesday, May 1, 2024

3 కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -
3 Corona cases registered in Telangana
Corona cases

 

40 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 471 మంది
వేగవంతమైన నియంత్రణ చర్యలతో కేసులు తగ్గుముఖం
జిహెచ్‌ఎంసి మినహా వేరే జిల్లాల్లో కేసులు సున్నా

కరోనా@ టెన్త్ వీక్

కొత్తగా మూడు కేసులు నమోదు, 40 మంది డిశ్చార్జ్
1085కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య
6, 8 వారాల్లో మర్కజ్ లింక్‌తో భారీగా నమోదైన కేసులు
వేగవంతమైన నియంత్రణ చర్యలతో తొమ్మిది, పదో వారంలో తగ్గుముఖం పట్టిన కేసులు
సోమవారం జిహెచ్‌ఎంసి మినహా వేరే జిల్లాల్లో కేసులు లేవు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ప్రవేశించి పదో వారం కొనసాగుతోంది. మార్చి 2వ తేదిన తొలి కరోనా కేసు నమోదు కాగా, పది వారాల్లో కేసుల సంఖ్య 1085కి చేరుకున్నాయి. దీనిలో ఆరు, ఎనిమిది వారాల్లోనే కేసులు భారిగా నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలతో చివరికి పది వారాల తర్వాత కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కొత్తగా కేవలం 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 40 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

దీంతో కరోనా బాధితుల సంఖ్య 1085కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 585 ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 471 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యారోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. సోమవారం నమోదైన కేసులన్నీ మళ్లీ జిహెచ్‌ఎంసి పరిధికి చెందినవి కావడం గమనార్హం. మిగతా జిల్లాల్లో కొత్త కేసులు రాకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం అయినప్పటికీ, జిహెచ్‌ఎంసి పరిధిలో క్రమంగా వైరస్ తీవ్రతను తగ్గేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఆరు, ఎనిమిది వారాల్లోనే భారీగా నమోదైన కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రవేశించి పదోవారం కొనసాగుతుండగా, వీటిలో ఆరు, ఎనిమిది వారాల్లోనే భారిగా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. మార్చి 1తేదిన తొలి పాజిటివ్ కేసు నమోదు కాగా, రెండో వారంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. మళ్లీ మూడో వారం మార్చి 16 వరకు కొత్తగా రెండు కేసులు రెండు కేసులు రాగా, నాలుగో వారం మార్చి 23 వరకు 30 కేసులు పెరిగాయి. ఐదో వారం మార్చి 30 వరకు 56 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరో వారం ఏప్రిల్ 6 వరకు ఏకంగా 303 మంది బాధితులు వైరస్ బారిన పడ్డారు. ఈ వారంలోనే ఇండోనేషియా, మర్కజ్ లింక్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఆరో వారం నుంచి క్రమంగా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గి ఏడో వారం ఏప్రిల్ 13 వరకు 153 మంది బాధితులకి కరోనా సోకింది. ఆరో వారంతో పోల్చితే ఏడో వారంలో కేసులు తగ్గుముఖం పట్టినా, ఎనిమిదో వారంలో భారిగా నమోదయ్యాయి.

ఏడో వారంతో పోల్చుకుంటే ఏకంగా 213 కేసులు పెరిగి ఏప్రిల్ 20వరకు 366 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఈ వారంలో వచ్చిన కేసులన్నీ మర్కజ్ లింక్ నుంచి వచ్చినవి కావడం గమనార్హం. దీంతో మర్కజ్ లింక్ ను వేగంగా ట్రెసింగ్ చేస్తూ వారికి పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్యం అందించింది. ఈ వారంలో వైద్య సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది 24 గంటల పాటు పనిచేస్తూ కరోనా తగ్గుముఖం పట్టడంలో క్రీయాశీలకంగా పనిచేశారు.

దీంతో తొమ్మిదో వారం కేసులు భాగా తగ్గాయి. ఏప్రిల్ 27 వరకు కేవలం 97 మందికి వైరస్, సోకగా, పదో వారం మే 4 వరకు 76 కేసులు మాత్రమే వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేసులు తగ్గుముఖం పట్టడంలో లాక్‌డౌన్ ఎంతో ఉపయోగపడిందని అధికారులు చెబుతున్నారు. పదో వారంలో వస్తున్న కేసులన్నీ జిహెచ్‌ఎంసి పరిధిలోనే నమోదవుతుండటంతో వైరస్ తీవ్రతను తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారని సమాచారం.

 

3 Corona cases registered in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News