Monday, April 29, 2024

పోలీస్‌స్టేషన్లకు పోటెత్తుతున్న వలస పక్షులు

- Advertisement -
- Advertisement -
Migrant workers To police stations
Migrant workers

 

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల, రాష్ట్రాల ప్రజలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌కు అనూహ్య స్పందన వచ్చిం ది. ఉదయం నుంచే వేలాది మంది తమ సొంత ప్రదేశాలకు వెళ్లడానికి పోలీసులు ఇచ్చిన లింకులో దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకంగా 7 వేల దరఖాస్తులు స్వీకరించి, వారికి ఆన్‌లైన్‌లో పాసులు జారీ చేశారు. మరో 13 వేల దరఖాస్తు లు పెండింగులో ఉన్నాయి. కానీ వేలాదిమంది ఒక్కసారిగా సైట్ ఓపెన్ చేయడంతో సైట్‌పై భారం పడి హ్యాంగ్ అయింది. దీంతో 3.30 తరువాత సైట్ పనిచేయడం నిలిచిపోయింది.

ఒకేసారి అధిక దరఖాస్తులు రావడం పోలీస్‌స్టేషన్లకు పోటెత్తుతున్న వలస పక్షులు వల్ల సైట్ క్రాష్ అయ్యిందని, త్వరలోనే పునరుద్ధరిస్తామన్న సమా చారం కనిపించింది. రాష్ట్రంలోని పలు జిల్లా లకు చెందిన అనేక మంది పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఇతర ప్రాంతాలకు వచ్చారు. మార్చి 22 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంతో 40 రోజులకి పైగా వారంతా ఇక్కడే చిక్కుకుపోయారు. ఆరు వారాలుగా చిక్కుకుపోయిన వీరు పోలీసులు అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా దరఖాస్తు చేసుకున్నారని, దీంతో సైట్ హ్యాంగ్ అయిందని డిజిపి కార్యాలయ అధికార వర్గాలు తెలిపాయి.

రెడ్‌జోన్‌లో వలసల ఆందోళన
నగరంలోని టోలిచౌకిలో వేలాది మంది కూలీలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. తమను సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌కు చెందిన వేలాది మంది కూలీలు హైదరాబాద్ టోలిచౌకి, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ రంగం, ఇతరత్రా పనులు చేస్తున్నారు. వారంతా ఒకేసారి రోడ్డుమీదకు వచ్చారు. టోలిచౌకి వాస్తవానికి పరిశీలిస్తే రెడ్ జోన్ ఏరియా.కానీ, అంతమంది ఒకేసారి రోడ్డు మీదకు ఎలా వచ్చారనేది ఆందోళనకరంగా మారింది. అంతమంది ఒకేసారి రోడ్డుమీదకు రావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తాము సొంత రాష్ట్రాలకు పంపేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

 

Migrant workers To police stations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News