Monday, April 29, 2024

ఉద్యమంలో విసిగి.. ఊరి బాట

- Advertisement -
- Advertisement -

32 Maoist surrendered in one day

 

లొంగుబాటలో 10 మంది మహిళలు
ఎవొబిలో పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతాలతో విసిగి పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు.లొంగిపోయిన 32 మంది దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్, క్రాంతికారి మహిళా ఆదివాసీ సంఘటన్, చేత్న నాట్య మండలి, జనతనా సర్కార్ గ్రూప్స్ తదితర విభాగాలకు చెందిన వారని ఎస్‌పి తెలిపారు.

తాజాగా లొంగిపోయిన వారిలో పలువురికి గతంలో పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై దాడికి పాల్పడిన నేపథ్యం ఉంది. నలుగురిపై తలో రూ.1లక్ష చొప్పున రివార్డు కూడా ఉందని ఆయన తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10వేలు చొప్పున అందించారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని అందించనున్నారు.మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నవారు ప్రజా జీవనంలోకి రావాలని కోరుతూ స్థానిక పోలీసులు లాన్ వర్రటు పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు నక్సల్ ప్రభావిత గ్రామాల్లో పెద్దఎత్తున పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 150 మంది వరకు నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని శవం 

చర్ల మండలం చెన్నాపురం మరియు గోరుకొండ గ్రామాల మధ్యలో అటవీ ప్రాంతంలోని రహదారిపై ఒక గుర్తు తెలియని మగ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. అనంతరం మృతదేహాన్ని గురించి విచారణ చేపట్టగా ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన నాయకులపు ఈశ్వర్‌గా గుర్తించారు. మృతుని కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు అతను గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులైన హారిభూషణ్, దామోదర్,చంద్రన్న లకు కొరియర్ గా పనిచేసేవాడని తేలింది.గత పదిరోజుల నుండి మావోయిస్టు పార్టీ కోసం పనిచేయాలని హరిభూషణ్,దామోదర్ లు ఈశ్వర్ ను తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి,చిత్రహింసలు పెట్టి అతనిని గొంతు నులిమి చంపివేసినారు. మావోయిస్టులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సామాన్య ప్రజలలో భయాందోళనలు సృష్టించటానికి అతనిపై పోలీస్ ఇన్ఫార్మర్ అని ముద్ర వేశారని, ఘటనకు పాల్పడిన వారిపై చర్ల పోలీస్ స్టేషన్లో 165/2020 క్రింద 143, 147 ,148,302,149,120, 25,10,13,20 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులే లక్ష్యంగా మందుపాతర 

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు తెగబడ్డారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. పెదబయలు సమీపంలోని ఇంజరీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భద్రతా బలగాలు తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెండు నెలల వ్యవధిలో వరుసగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చుతున్నారు. మరోవైపు ఏవోబీలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News