Thursday, May 9, 2024

శివారు మురుగు సమస్యకు రూ. 35 కోట్లు కేటాయింపు

- Advertisement -
- Advertisement -

35 crore allocation for suburban sewage problem

ఇప్పటికే హాట్‌స్పాట్‌లను గుర్తించిన జలమండలి
రెండు వారాల్లో పనులు ప్రారంభించనున్న బోర్డు

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు సమస్యల పరిష్కారానికి రూ. 35 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు జలమండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో శివారు మున్సిపాలిటీల సీజిఎలు, జీఎంలు, డిజీఎంలతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి శివారు మున్సిపాలిటీల్లో సీవరేజీ నిర్వహణ బాధ్యతలు జలమండలి స్వీకరించింది. ఈప్రాంతాల్లో సీవరేజీ తరుచూ ఓవర్‌ప్లో అవుతున్న హాట్‌స్పాట్‌లను గుర్తించాలని ఆదేశించారు. జలమండలి మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్దాయిలో పరిశీలన జరిపి మొత్తం 792 హాట్‌స్పాట్‌లను గుర్తించారు. ఈహాట్‌స్పాట్‌ల వద్ద మురుగు సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యతాక్రమంలో జలమండలి పనులను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా సుమారు రూ. 35 కోట్లతో రెండు వారాల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్లు శ్రీధర్‌బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీల్ ప్రవీణ్‌కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ ఆజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News