Monday, April 29, 2024

పాక్ అఫ్ఘనీలతో 40 మంది ఉగ్రగ్యాంగ్

- Advertisement -
- Advertisement -
40 Terrorists gang with Pakistani Afghans
పండుగల సీజన్‌లో భారత్‌లో దాడుల వ్యూహం
నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తం
ఎల్‌ఒసి ఆవల శిబిరాలలో మకాం
నదిని దాటి వచ్చేందుకు ప్లాన్

న్యూఢిల్లీ : అఫ్ఘనిస్థాన్‌లో పాగా వేసుకుని ఉన్న పాక్ ఉగ్రవాదుల బృందం ఒకటి భారత్‌లోకి చొచ్చుకుని వచ్చేందుకు కాచుకుని ఉంది. భారతదేశంలో వచ్చే పండుగల సందడిని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు దిగాలని ఈ బృందం వ్యూహరచనతో ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పసికట్టాయి. మొత్తం 40 మందితో కూడిన ఉగ్ర ముఠాలోని వారంతా అఫ్ఘన్ జాతీయులే అని సమాచారం అందింది. ఈ బృందం అదునుచూసుకుని ముందుగా జమ్మూ కశ్మీర్‌లోకి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు చేరుకోవాలని ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు ధృవీకరించుకున్నాయి. ఇప్పుడు ఈ బృందం నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) వెంబడి పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలలో మకాం వేసుకుని ఉన్నారు. దేశంలో సెప్టెంబర్ మాసాంతం నుంచి పండుగల సీజన్‌కు తెరలేస్తుంది. పలు పర్వదినాలు సామూహిక రీతిలో వేడుకగా జరుగుతాయి.

ఉగ్రవాదులు ఇప్పుడు అఫ్ఘనిస్థాన్‌లో తమకు దక్కిన ఆశ్రయం, పాకిస్థాన్ నుంచి అందుతున్న వెన్నుదన్నులను చూసుకుని భారత్‌లోని ప్రశాంతతను చెదరగొట్టేందుకు భారీ స్థాయి స్కెచ్‌లకు దిగుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనితో సరిహద్దు భద్రతా బలగాలు, స్థానిక పోలీసు దళాలను అన్ని స్థాయిలలో అప్రమత్తం చేస్తున్నారు. పారామిలిటరీ బలగాలు ఈ కోణంలో సర్వంసన్నద్ధంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌లో వేళ్లూనుకుని ఉన్న లష్కరే తోయిబా, జమాతే ఇతర ఉగ్రసంస్థల కార్యకలాపాలకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ నుంచి ప్రోత్సాహం ఇటీవలి కాలంలో మితిమీరింది. అఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటి పరిస్థితులలో తాలిబన్ల అదుపులో కూడా లేకుండా ఉన్న పలు స్థానిక ఉగ్ర లేదా తీవ్రవాద ముఠాలు భారత్‌లో టెర్రర్‌కు పాక్ ఉగ్రసంస్థలతో కాంట్రాక్టు వంటివి కుదుర్చుకున్నట్లు స్పష్టం అయింది.

ఎల్‌ఒసి వెంబడి ఉన్న నాక్యాల్ సెక్టార్లోని కీలకమైన ఉగ్రశిబిరంలో ఉగ్రవాదుల బృందం మకాం వేసుకుని ఉంది. సరిహద్దులు దాటేందుకు సరైన ఆదేశాల కోసం ఎదురుచూస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దులలోని క్యాంప్‌లో ఉన్న టెర్రరిస్టులు పూంఛ్ నదిని ట్యూబ్‌లు చిన్నపాటి నాటుపడవల ద్వారా దాటేందుకు వీలుందని పసికట్టారు. సరిహద్దులలో భద్రతా వలయాలను ఛేదించుకుని రావడం ఉగ్రవాదులకు అయ్యే పనికాదు. దీనితో ఇతరత్రా మార్గాలను ఎంచుకుని రావాలని యత్నిస్తున్నారు. ప్రత్యేకించి లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ అన్సర్ (హ్యూవా) హిజ్బుల్ ముజహిద్దిన్ సంస్థలు ముందడుగు వేసేందుకు కసరత్తు ఆరంభించినట్లు నిఘా వర్గాలు తేల్చాయి.

టిఫిన్ బాంబులు, ఆత్మాహుతి దాడులు?

ఇప్పుడు మకాం వేసి ఉన్న ఉగ్ర ముఠాలో పలువురు టిఫిన్ బాక్స్ బాంబుల తయారీలో తర్ఫీదు పొందారు. ఎక్కువగా ఆత్మాహుతిదాడుల ద్వారా కలకలం రేపాలని ఆలోచిస్తున్నట్లు పసికట్టారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ రాజకీయ ఉనికిని మారుస్తూ ఆర్టికల్ 370 రద్దుకు దిగిన నాటి నుంచి కశ్మీర్‌లో కల్లోలానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు పావులు కదుపుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో పెద్దగా ఉగ్రవాద చర్యలు జరగలేదు. పరిస్థితి పూర్తి స్థాయిలో కుదుపటపడటానికి ముందే ఉగ్రవాద చర్యలతో కశ్మీర్‌లో కానీ ఇతర ప్రాంతాలలో కానీ తమ ఉనికిని చాటుకోవడం ప్రత్యేకించి వర్గవైషమ్యాలు రెచ్చగొట్టేలా చేయడం వంటివి వీరి వ్యూహాలలో భాగంగా ఉన్నట్లు తేలింది.

స్లీపర్ సెల్స్ పాత్ర కీలకమే

దేశంలో పలు ప్రాంతాలలో నిద్రాణంగా ఉన్న పలు ఉగ్ర స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులకు పలు విధాలుగా సహకరించే వీలుంది. టిఫిన్ బాక్స్‌లను రూపొందించేందుకు అవసరం అయిన ముడిసరుకును ఈ స్లీపర్ సెల్స్ అందిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News