Wednesday, May 15, 2024

స్మిత్ సేనకు షాక్

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జోరుకు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 37 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇదే తొలి ఓటమి. ముందుగా బ్యాటిం గ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగు లు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే కష్టా లు మొదలయ్యాయి. తొలి రెండు మ్యాచుల్లో మెరుపులు మెరిపించిన ఓపెనర్ స్టీవ్ స్మిత్ (3) ఈసా రి నిరాశ పరిచాడు. ఇక విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్న సంజు శాంసన్ కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

మరోవైపు రాబిన్ ఉతప్ప (2) తన పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. జట్టు ను ఆదుకుంటాడని భావించిన స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా ఆశించిన స్కోరును సాధించలేదు. రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 21 పరుగులు చేసి మావి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక కిందటి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన రాహుల్ తెవాటియా కూడా జట్టును ఆదుకోలేక పోయాడు. రాహుల్ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా టామ్ కరన్ ఒంటరి పోరాటం చేశాడు. కోల్‌కతా బౌలర్లను దీటుగా ఎదుర్కొ న్న టామ్ 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతాను యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆదుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గిల్ (47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇయాన్ మోర్గాన్ 34(నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో కోల్‌కతా మెరుగైన స్కోరును సాధించింది.

IPL 2020: KKR Beat RR by 37 Runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News