Saturday, May 4, 2024

దేశంలో 13లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

48916 Covid 19 cases and 757 deaths in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 48,916 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 757 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,36,861కి చేరుకున్నాయి. వీటిలో 4,56,071 యాక్టివ్ కేసులుండగా… 8,49,431 నయమై కోలుకున్నారు. ఇండియాలో ఇప్పటివరకు 31,358 మంది బాధితులు కరోనాతో మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది

అటు మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 3,57,117 మందికి కరోనా సోకగా… 13,132 మంది ఈ వైరస్ తో మృతి చెందారు. తమిళనాడులో కోవిడ్ కేసులు 2లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం 1,99,749 మంది కరోనా బారినపడ్డారు. 3,320 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 3,777 మందిని కరోనా కబలించగా… 1,28,389 మందికి ఈ మహమ్మారి సోకింది. కర్నాటకలో కరోనా విస్తరణ ఏక్కువగా ఉంది. ఇప్పటివరకు 85,870కి కోవిడ్ పాజిటివ్ రాగా… 1,724 మంది ప్రాణాలు విడిచారు. వెస్ట్ బెంగాల్ లో కూడా కరోనా కేసులు 50వేలు దాటాయి. రాష్ట్రంలో 1,290 మంది ఈ వైరస్ తో మృత్యువాత పడ్డారు. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మహోగ్ర రూపం దాల్చుతోంది.

48916 Covid 19 cases and 757 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News