Monday, April 29, 2024

24 గంటల్లో 49,310 కేసులు.. 740 మరణాలు

- Advertisement -
- Advertisement -

49310 Covid 19 cases and 740 deaths reported in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా ఒకే రోజు 49,310 కొత్త కోవిడ్-19 కేసులు, 740 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,87,945కి చేరింది. వీటిలో 4,40,135 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు దేశంలో 8,17,209 నయమై కొలుకున్నారు. దేశవ్యాప్తంగా 30,601 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జూలై 23 వరకు 1,54,28,170 కరోనా  పరీక్షలు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. గురువారం 3,52,801 మందిరి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పేర్కొంది.

అటు మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 3,47,502 మందికి కరోనా వైరస్ సోకింది. 12,854 మంది ఈ వైరస్ తో చనిపోగా… 1,94,253 మంది కోలుకున్నారు. తమిళనాడులో 1,92,964 మంది కోవిడ్ బారిన పడగా… 3,232 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు 1,26,323కు చేరుకున్నాయి. మరణాలు 3,719గా నమోదయ్యాయి. కర్నాటకలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. కేసులు 71,069కి చేరుకున్నాయి. 1,464 మంది మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా కేసులు 53వేలు దాటగా… 1229మంది ఈ వైరస్ తో మరణించారు. గుజరాత్ లో 52,563 మందికి ఈ మహమ్మారి బారిన పడగా… 2,257మందిని కరోనా కబలించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కరోనా వైరస్ భయపెడుతోంది.

49310 Covid 19 cases and 740 deaths reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News