- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు కుప్పలుగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 52,123 కరోనా పాజిటివ్ కేసులు, 775 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792కి పెరిగాయి. అందులో 5,28,242 మంది దేశంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10,20,582 నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ బారిన పడి 34,968 మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. భారత్ లో కరోనా కేసులు 16లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇండియాలో రికవరీ రేటు 64.44శాతం ఉండగా.. మరణాల రేటు 2.21శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.
52123 Corona positive cases and 775 deaths in India
- Advertisement -