Tuesday, April 30, 2024

కేంద్ర మంత్రి వర్గంలో 53 మంది బడుగు బలహీన వర్గాలే: రాజేందర్

- Advertisement -
- Advertisement -

హుజూరాబాద్: సామాజిక వర్గాల సమతుల్యతతో తొలిసారి కేంద్ర మంత్రివర్గానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తగిన న్యాయం చేశారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రశంసించారు. 80 మంది మంత్రుల్లో 53 మందికి బడుగు బలహీన వర్గాల, మైనారిటీ వారికి అవకాశం కల్పించారని, వీరిలో 27 మంది ఓబిసి, 5 మైనారిటీ, 12 మంది ఎస్సి, ST లో 8 మందికి చోటు కల్పించారు మోడి గారు. అన్నీ వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కలిపించారన్నారు.  హుజూరాబాద్ లోని కమలాపూర్ లో గౌడ ఘర్జన కార్యక్రమంలో ఈటెల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కూడా అణగారిన వర్గాల నిలయం కానీ అన్ని వర్గాల సమతుల్యత ఈ రాష్ట్రంలో లేదన్నారు. 17 శాతం ఉన్న ఎస్సిలో ఒక్కరు మాత్రమే మంత్రిగా ఉన్నారని. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇక్కడ అవకాశం లేదన్నారు. తెలంగాణ లో కులాల చైతన్యం ఎక్కువ, అన్నీ కులాల వారు బిజెపికి మద్దతు ఇస్తున్నారని, ఆత్మ గౌరవం కోసం ఉన్నాం తప్ప డబ్బులకోసం కాదు అని మరో సారి గౌడన్న లు అందరూ చాటి చెప్పబోతున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి  కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్, కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, మాజీ ఎంపి, హుజూరాబాద్ ఎన్నికల బిజేపి ఇంచార్జ్ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, కూన శ్రీశైలం గౌడ్, ధర్మారావు, బిజేపి సీనియర్ నాయకులు ప్రేమేంధర్ రెడ్డి, తుల ఉమ, వేణుగోపాల్ రెడ్డి, అశ్వథామరెడ్డి, రావు పద్మ, జోస్న, ఓయు జాక్ నేత సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News