Friday, April 26, 2024

దేశంలో 23లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

60963 Covid 189 cases and 834 deaths reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 23 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,963 కొత్త కోవిడ్-19 కేసులు, 834 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,29,639కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 6,43,948 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 1,63,9600మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాలు 46,091కి చేరాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఆగస్టు 11 వరకు దేశంలో 2,60,15,297మంది రక్ష నమూనాలను పరీక్షించినట్టు ఐసిఎంఆర్ తెలిపింది. వీటిలో మంగళవారం 7,33,449మందికి కరోనా టెస్టులు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. అటు మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 5,35,601 మందికి కరోనా సోకింది.  ప్రస్తుతం 1,48,810మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,435 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా… 18,306 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.

6963 Covid 19 cases and 834 deaths reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News