Thursday, May 16, 2024

బైడెన్ బృందంలో 61 శాతం మంది మహిళలే

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ తన వైట్‌హౌస్‌కు చెందిన కొత్త పరిపాలనా జట్టులో 61 శాతం మంది మహిళలు, 54 శాతం మంది శ్వేత జాతికి చెందని వారు ఉన్నారని కొత్తగా అధికార పగ్గాలు చేపట్టనున్న బైడెన్ బృందం తెలిపింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రభుత్వం భిన్న సిద్ధాంతాలకు, అనుభవాలకు ప్రాధాన్యతనిస్తూ దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సవాళ్లను తమ జట్టులోని సభ్యుల ప్రతిభాపాటవాలతో సమర్థంగా ఎదుర్కొంటుందని బైడెన్ బృందం తెలిపింది. తమ జట్టుకు చెందిన 100 మందికి పైగా సభ్యుల ఎంపికను బైడెన్-హారిస్ బుధవారం నాటికి పూర్తి చేశారు. అమెరికన్ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా కొత్త పాలనా యంత్రాంగం పనిచేస్తుందని, అధికార బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రజల కోసం పనిచేస్తుందని బైడెన్ బృందం తెలిపింది. కొత్తగా నియమితులైన వారిలో 20 శాతం మంది తొలి తరం అమెరికన్ పౌరులని తెలిపింది.

61% are women in Biden’s team for White House

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News