Sunday, May 5, 2024

కరోనా విజృంభణతో ఇండియా ఉక్కిరి బిక్కిరి

- Advertisement -
- Advertisement -

India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 6,535 కొత్త కోవిడ్-19 కేసులు, 146 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,380కి చేరింది. దేశవ్యాప్తంగా  80,722 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 60,490 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని నయమయ్యారు. ఈ వైరస్ మహమ్మారి బారినపడి 4,167మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటికే భారత్ ప్రపంచ కరోనా జాబితాలో 10వ స్థానానికి చేరింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఇండియా 4వ స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ లోనే కొత్త కేసులు ఎక్కవ నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలు దాటింది. గుజరాత్, తమిళనాడును కరోనా భూతం కలవరపెడుతోంది. ఇటు తెలంగాణలోనూ కరోనా వైరస్ మళ్లీ విజృంబిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News