Monday, April 29, 2024

వృద్ధుడిపై అత్యాచారం కేసు

- Advertisement -
- Advertisement -
Rape
దొంగతనం కేసు వాపస్ తీసుకోలేదని అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి, దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు

హైదరాబాద్: పనిమనిషి తన ఇంట్లో చోరీ చేసిందని కేసు పెట్టిన యజమానిని, కేసు వాపస్ తీసుకోకపోవడంతో అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎంఎల్‌ఎ కాలనీకి చెందిన వృద్ధుడు మొహ్మద్ సలీమ్ ఉద్దిన్(70) విదేశాల్లో ఉంటాడు. ఇతడికి నలుగురు భార్యలు ఉన్నారు. వారు విదేశాల్లో ఉంటున్నారు. తరచూ నగరానికి వచ్చే వృద్ధుడు పలువురికి ఆర్థిక సాయం చేసేవాడు.

కొంత కాలం క్రితం ఆర్థిక సాయం చేస్తానని చెప్పి తనను ఇంటికి పిలిచిన వృద్ధుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి(23) ఆరోపించింది. అయితే సదరు యువతి కేసు వాపస్ తీసుకోమని కోరినా వృద్ధుడు వినకపోవడంతో ఆర్థిక సాయం చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.

సిపిని కలిసిన యువతి

తనపై వృద్ధుడు అత్యాచారం చేశాడని సదరు యువతి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. సిపి యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

70 Year Old Booked For Rape Case in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News