Saturday, May 4, 2024

రాష్ట్రంలో 729 కరోనా కేసులు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

729 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 772 మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 6,36,049కి పెరిగాయి. ఇప్పటి వరకు 6,22,313 మంది కోలుకున్నారు. మరో 9980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 3756కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాడు 1,15,515 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా వచ్చిన కేసులలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 71 కేసులు, ఆదిలాబాద్ జిల్లాలో 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 కేసులు, జగిత్యాల జిల్లాలో 22 కేసులు, జనగామ జిల్లాలో 6, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13 కేసులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 5, కామారెడ్డి జిల్లాలో 3 కేసులు,

కరీంనగర్ జిల్లాలో 65 కేసులు, ఖమ్మం జిల్లాలో 52 కేసులు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 5 కేసులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 6 కేసులు, మహబూబాబాద్ జిల్లాలో 13 కేసులు, మంచిర్యాల జిల్లాలో 53, మెదక్ జిల్లాలో 6 కేసులు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 కేసులు, ములుగు జిల్లాలో 13 కేసులు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 4 కేసులు, నల్గొండ జిల్లాలో 45 కేసులు, నారాయణపేట జిల్లాలో 0 కేసులు, నిర్మల్ జిల్లాలో 4 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 6 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 53 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 26 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 5 కేసులు, సిద్దిపేట జిల్లాలో 17 కేసులు, సూర్యాపేట జిల్లాలో 44 కేసులు, వికారాబాద్ జిల్లాలో 6 కేసులు, వనపర్తి జిల్లాలో 8 కేసులు, వరంగల్ రూరల్ జిల్లాలో 41 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 47 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 కేసుల చొప్పున నమోదయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News