Friday, May 10, 2024

సిటీలో కరోనా కేసులు 147

- Advertisement -
- Advertisement -

రెండు నెలల తర్వాత వెయ్యిలోపు కేసులు
కొత్తగా 894 పాజిటివ్‌లు, 10 మంది మృతి
జిహెచ్‌ఎంసిలో 147, జిల్లాల్లో 747 మందికి వైరస్
703కి చేరిన కరోనా మరణాలు, 92,255కి పెరిగిన బాధితుల సంఖ్య

894 New Corona Cases Registered in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు రెండు నెలల తర్వాత వెయ్యిలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. గత నెండు నెలల నుంచి ప్రతి రోజు సగటున 2వేల తగ్గకుండా నమోదైన కేసులు, ప్రస్తుతం తగ్గుముఖంగా పట్టాయి. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో వారం రోజులుగా వైరస్ ఉదృతి తగ్గుతూ వస్తుంది. జిల్లాల్లో కూడా సెప్టెంబర్ చివరి వరకు మరింత తగ్గే అవకాశం ఉందని వైద్యశాఖ అంచనా. ఇదిలా ఉండగా ఆదివారం రాష్ట్రంలో 20,291 మందికి టెస్టులు చేయగా 894 మందికి పాజిటివ్‌లు తేలాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో కేవలం 147 మంది మాత్రమే ఉండగా, ఆదిలాబాద్‌లో10, భద్రాద్రి 9, జగిత్యాల 31, జనగామ 7, భూపాలపల్లి 0, గద్వాల 21, కామారెడ్డి 7, కరీంనగర్ 69,ఖ మ్మం 44, ఆసిఫాబాద్ 11, మహబూబ్‌నగర్ 30, మహబూబాబాద్ 31, మంచిర్యాల 17, మెదక్ 8, మేడ్చల్ మల్కాజ్‌గిరి 51, ములుగు 6, నాగర్‌కర్నూల్ 15, నల్గొండ 37, నారాయణపేట్ 0, నిజామాబాద్ 38, నిర్మల్ 0, పెద్దపల్లి 62, సిరిసిల్లా 2, రంగారెడ్డి 85, సంగారెడ్డి 29, సిద్ధిపేట్ 58, సూర్యాపేట్ 12, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ లో 44, యాదాద్రిలో మరోకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 10 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 92,255కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 70,132కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 21,420 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 14,420మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 703కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.
ఎర్రగడ్డ మెంటల్ హస్పిటల్‌లో 36 మందికి వైరస్..
ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో 36 మంది పేషెంట్లకు కోవిడ్ పాజిటివ్ తేలినట్లు సమాచారం. వైద్యసిబ్బంది నుంచే వీరికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సరైన కిట్లు ధరించకపోవడంతో పాటు, వీక్లి పద్దతి క్వారంటైన్ పాటించకపోవడంతోనే వైరస్ వ్యాప్తి చెందినట్లు ఆరోగ్యశాఖ భావిస్తుంది.
326 నుంచి 1076కి పెరిగిన యంటీజెన్ సెంటర్స్ సంఖ్య..
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా టెస్టింగ్ కేంద్రాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ 40వేల టెస్టులు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈక్రమంలోనే ఇప్పటి వరకు యంటీజెన్ టెస్టులను కేవలం 326 కేంద్రాల్లో మాత్రమే చేయగా, ఇక నుంచి సుమారు 1076 కేంద్రాల్లో చేసేందుకు వైద్యశాఖ సిద్ధమైంది. ఈ మేరకు కిట్లను పంపించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 23 సెంటర్స్‌లో ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేస్తుండగా, జిహెచ్‌ఎంసి పరిధిలో కంటైన్‌మెంట్ జోన్లలో మొబైల్ వాహనం ద్వార ఆర్‌టిసిపిఆర్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,53,349 మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు బులెటెన్‌లో ప్రకటించారు.

894 New Corona Cases Registered in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News