Friday, May 3, 2024

రూ.100 కోట్ల డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

ముగ్గురు నిందితుల అరెస్ట్
కార్గో బస్సును వెంటాడి పట్టుకున్న డిఆర్‌ఐ అధికారులు
హైదరాబాద్, ముంబైలో ఏకకాలంలో సోదాలు
రూ.100కోట్ల డ్రగ్స్, రూ.50లక్షల రా మెటీరియల్ స్వాధీనం
నగరంలో 250 కిలోల డ్రగ్స్ పట్టివేత

Drugs worth rs 100 Crore Seized in Hyderabad

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో 250 కిలోల (డ్రగ్స్)మత్తుమందు. రా మెటిరియల్ వెరసి రూ.150 కోట్ల మత్తు పదార్థాలను సోమవారం నాడు డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో రూ.28 కోట్ల విలువైన 210 కిలోల మెఫిడ్రిన్‌ను, 50 కోట్ల విలువైన రా మెటిరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌లో వినియోగించే మత్తుమందులైన 31 కిలోల ఎప్రిడ్రున్, 10కిలోల కెటమైన్, మెపిడ్రీన్ తరలిస్తున్న కార్గో బస్సుని వెంటాడి స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్‌ఐ అధికారులు వివరించారు. ఈక్రమంలో మత్తు మందు సరఫరా జరుగుతున్నట్లు పక్కా సమాచారం మేరకు డిఆర్‌ఐ అధికారులు ముంబై హైదరాబాదులో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇదిలావుండగా హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీలో రూ.100 కోట్ల విలువైన మత్తు మందును ఉన్నట్లు డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు.

అలాగే అదే ఫార్మా కంపెనీలో మత్తు మందు తయారీకి సంబంధించిన రూ. 50 కోట్ల విలువ చేసే మత్తుమందు రా మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మత్తుమందు ను సరఫరా చేసేందుకు పథకం రచించిన డ్రగ్ డీలర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా 2017 లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డ్రగ్ డీలర్‌ను తిరిగి పట్టుకున్నట్లు డి ఆర్ ఐ అధికారులు వివరిస్తున్నారు. కాగా హైదరాబాద్, ముంబై కేంద్రంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులపై నిఘా సారించడంతో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టుయ్యిందని, ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు నిందితునిపై ప్రత్యేక దృష్టి సారించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులపై ఎన్‌డిపిఎస్ చట్టం 1985తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని డిఆర్‌ఐ అధికారులు తెలిపారు.

Drugs worth rs 100 Crore Seized in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News