Monday, May 6, 2024

‘మా’ వాగ్దానాలను 90 శాతం నెరవేర్చాం

- Advertisement -
- Advertisement -

90 percent promises fulfilled in Manifesto

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ‘మా’కు ఎన్నికై ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో నెరవేర్చిన వాగ్దానాలను గురించి వివరించడానికి ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంచు విష్ణుతో పాటు మాదాల రవి, శివ బాలాజీ, ఇతర ప్యానెల్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ “గత ఏడాది అక్టోబర్ 13న నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాను. ‘మా’ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో 90 శాతం నెరవేర్చాం. ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి అనే అంశాన్ని సమకూర్చాము.

నటీనటుల జాబితాతో ఒక పుస్తకం రూపొందించాము. ఆ పుస్తకాన్ని ప్రతి నిర్మాత, దర్శకుడికి పంపించాము. సోషల్ మీడియా యాప్ రెడీ చేస్తున్నాం, సంక్రాంతికి సిద్ధమవుతుంది. ఈ యాప్ కాన్సెప్ట్ భారత దేశంలో ప్రప్రధమం. ‘మా’ అసోసియేషన్ మహిళల రక్షణను కోరుకుంటోంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్‌ని సలహాదారురాలిగా తీసుకొని మేము ఒక కమిటీ ఏర్పాటు చేశాము. మహిళలకి ఏ విధమైన సమస్య వచ్చిన ఈ కమిటీ పరిష్కరిస్తుంది. ఇక ‘మా’ సభ్యులు ఎవరైనా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, ధర్నాలు చేసినా వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తాం. ఫిలిం నగర్ క్లబ్ నుంచి 30 నిమిషాల దూరంలో ఒక బిల్డింగ్ చూశాం. అది 6 నెలలో సిద్ధమవుతుంది. లేకపోతే ఫిలిం నగర్ ఛాంబర్ కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అయితే ఆ బిల్డింగ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి స్థలం ఉంటుంది. అప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి అన్ని విధాలాగా సాయం చేస్తాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News