Tuesday, May 14, 2024

ఒక్క రోజే 100 బిలియన్ సందేశాలు

- Advertisement -
- Advertisement -
WhatsApp
కొత్త సంవత్సరం సందర్భంగా వాట్సాప్ రికార్డు

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. న్యూ ఇయర్ సందర్భంగా అరుదైన మైలురాయిని చేరుకుంది. కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందు వాట్సాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ సందేశాలు బట్వాడా అయ్యాయి. అందులో 20 బిలియన్ సందేశాలు భారత్‌లోనివే కావడం విశేషం. అంటే ఒక్క మన దేశంలోనే అయిదో వంతు సందేశాలు నమోదు కావడం గమనార్హం. ఇలా ఒక్క రోజులోనే ఇన్ని సందేశాలు బట్వాడా కావడం వాట్సాప్ చరిత్రలో ఇదే ప్రథమం కావడం విశేషం. డిసెంబర్ 31 అర్ధరాత్రినుంచి 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ సందేశాలు ఒకరికొకరు పంపించుకున్నారని వాట్సాప్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క రోజులో ఇంత పెద్దసంఖ్యలో సందేశాలు వెళ్లడం వాట్సాప్ సేవలు మొదలైన తర్వాత ఇదే తొలిసారని కంపెనీ పేర్కొంది. ఇందులో 12 బిలియన్ చిత్రాలు ఉన్నాయని తెలిపింది.

100 Billion WhatsApp Messages Sent on New Year

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News