Thursday, May 9, 2024

క్షణాల వ్యవధిలో బతికిపోయా

- Advertisement -
- Advertisement -

‘భారతీయుడు 2’ సెట్‌లో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఈ చిత్ర హీరోయిన్ కాజల్ ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేసింది. “ఈ సినిమాలో మాతో పాటు పనిచేసే కృష్ణ, చంద్రన్, మధును బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో కోల్పోవడం బాధగా ఉంది. నా గుండెలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఇక కేవలం కొన్ని క్షణాల వ్యవధిలో నేను ఈ ప్రమాదంనుంచి తప్పించుకొని ఇలా ట్వీట్ చేయగలుగుతున్నా. ఆ ఒక్క క్షణం… నాకు కాలం, జీవితం విలువ తెలిసింది”అని కాజల్ ట్విట్టర్‌లో పేర్కొంది. ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలో కమల్‌హాసన్, సిద్ధార్థ్, కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Kajal Aggarwal tweet on Indian 2 Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News