Thursday, May 9, 2024

దేశంలో తొలిసారిగా సోషల్ మీడియా యాప్స్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Social Media Apps

 

హైదరాబాద్ ః ప్రధాన సోషల్ మీడియా యాప్‌లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్‌టాక్‌లపై దేశలో తొలిసారిగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీనిపై 14వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలిచ్చారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సిసిఎస్‌లోని సైబర్ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరి శ్రీశైలం ఈ యాప్స్‌పై ఫిర్యాదు చేయగా.. స్పందించిన కోర్టు తక్షణం విచారణ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సోషల్ మీడియాలో జరుగుతున్న సిఎఎ వ్యతిరేక ప్రచారంపై గత డిసెంబర్ 12న తొలుత హైదరాబాద్ నగర పోలీసు స్పెషల్ రబాంచ్ జాయింట్ కమిషనర్ మహంతిని కలిసి శ్రీశైలం ఫిర్యాదు చేశారు.

అయితే ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. సున్నితమైన మతపర అంశాలను రెచ్చగొడుతూ దేశ వ్యతిరేక కార్యక్రమాలకు వాట్సాప్, ట్విటటర్, టిక్‌టాక్ గ్రూప్‌ల వివరాలను కూడా శ్రీశైలం జతపర్చారు. వీటన్నింటినీ పరిశీలించిన మెజిస్ట్రేట్.. సైబర్ పోలీసులకు రిఫర్ చేశారు. దీనితో దేశంలోనే మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా యాప్స్‌పై కేసులు నమోదయ్యాయి. ఐపిసి సెక్షన్ 153ఎ, 121ఎ,124, 124ఎ, 294, 295 ఎ, 505, 120బి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, సెక్షన్ 66 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Case against Social Media Apps for first time
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News