Wednesday, May 15, 2024

సంజయ్ తెలుసుకొని మాట్లాడూ: కర్నె

- Advertisement -
- Advertisement -

Karne Prabhakar

 

హైదరాబాద్: తెలంగాణపై కనీస అవగాహన లేని నేతను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను నియమించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. సిఎం కెసిఆర్‌పై బిజెపి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా బండి సంజయ్‌కు అవగాహన లేనట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నిధులపై లెక్కలు తెలియకపోతే సంజయ్ తెలుసుకొని మాట్లాడాలని చురకలంటించారు. సిఎం కెసిఆర్ చెప్పిన లెక్కలకు హోంశాఖ మంత్రి అమిత్ షానే మాట్లాడలేకపోయారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అమిత్ షాతో పోల్చితే సంజయ్ పిల్లవాడన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News