Monday, May 6, 2024

చైనా వైరస్‌కు ఆధారం ఏది

- Advertisement -
- Advertisement -

Mike Pompeo

 

నిబీజింగ్: కరోనా వైరస్ చైనా సృష్టిగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొనడంపై చైనా మండిపడింది. ఉత్తుత్తి ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఉంటే చూపుతారా? అని సవాలు విసిరింది. ఎంతసేపూ సవిస్తార ఆధారం ఉందని బెదిరించడంతో సరిపోదని, వాటిని వెల్లడించాలని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హ్యూవా ఛూన్యింగ్ స్పందించారు. వూహాన్‌లోని వైరాలజీ సంస్థ నుంచే వైరస్ పుట్టిందని, ఇందుకు తమ వద్ద పూర్తి సాక్షాధారాఉ ఉన్నాయని అమెరికా మంత్రి ఇటీవలే తెలిపారు.

అయితే ఆధారాలు ఉన్నట్లు అయితే ఎందుకు వెల్లడించడం లేదని ఈ మహిళా ప్రతినిధి తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టే , ఇటువంటి ఆరోపణలకు దిగుతున్నారని అన్నారు. వైరస్ మానవ సృష్టి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పిందని చైనా ప్రతినిధి తెలిపారు. కరోనా వైరస్ ఏ విధంగా పుట్టిందనే అంశంపై వివిధ వాదనలు ఉన్నాయని, నిజానికి దీనిని కనుగొనడం చాలా సంక్లిష్ట అంశం. సైంటిస్టులు, సంబంధిత నిపుణులు దీనిపై విస్తృత పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.

China asks Mike Pompeo show enormous evidence
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News