- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: వివాహం జరిగిన రెండు నెలలకే ఓ నవ వధువు అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాండురంగారావుకు ఖమ్మంకు చెందిన సంతోషి(25) ఫిబ్రవరి 15వ తేదీన వివాహం జరిగింది. రోజు మాదిరిగానే వాకింగ్ చేసేందుకు అపార్ట్మెంట్ పైకి వెళ్లిన సంతోషి బుధవారం ఉదయం కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తామామల ప్రవర్తన నచ్చకే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.
Married Woman attempts suicide in Gachibowli
- Advertisement -