Wednesday, May 15, 2024

క్రిమిసంహారక మందులతో ఫలితం ఉండదు

- Advertisement -
- Advertisement -

Spraying Disinfectants can be Harmful

 

జెనీవా : కరోనా నిర్మూలన కోసం వీధుల్లో విచ్చల విడిగా క్రిమి సంహారక మందులను స్ప్రే చేసే అలవాటు కొన్ని దేశాల్లో కొనసాగుతోందని, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు సరికదా ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కరోనాకు కానీ లేదా ఇతర వైరస్‌లకు కానీ వీధులు, మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులను స్ప్రే చేయాలన్న సిఫార్సు ఏదీ లేదని, ఎందుకంటే మురికి, చెత్త వల్ల క్రిమిసంహారక మందు పనిచేయకుండా పోతుందని పేర్కొంది. కొన్ని చోట్ల మనుషులపై నేరుగా క్లోరిన్ తదితర విష రసాయనాలను ప్రయోగిస్తున్నారని, దీనివల్ల కళ్లకు ప్రమాదం ఏర్పడడంతోపాటు చర్మం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News