Saturday, May 4, 2024

ఐసిసి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

- Advertisement -
- Advertisement -

నేడు ఐసిసి వర్చువల్ సమావేశం

తేలనున్న వరల్డ్‌కప్ భవితవ్యం

దుబాయి: పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నిర్వాహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎలాంటి నిర్ణయం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం ఐసిసి వర్చువల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఐసిసి వరల్డ్‌కప్ నిర్వహణ విషయమై తుది ప్రకటన చేసే అవకాశాలున్నాయి. దీంతో భారత క్రికెట్ బోర్డుతో సహా అందరి దృష్టి ఈ సమావేశంపైనే నెలకొంది. ఈ సమావేశం తర్వాతే భారత్‌లో ప్రతి ఏడాది జరిగే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి భవిష్యత్తు కార్యచరణ ప్రణాళికను రూపొందించే అవకాశాలున్నాయి. దీంతో భారత్‌కు చెందిన కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కూడా ఐసిసి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలావుండగా ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వరల్డ్‌కప్ నిర్వహించడం తమకు సాధ్యం కాదని నిర్వాహక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చినా అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పటికీ నాన్చుడూ ధోరణినే అవలంభిస్తోంది. నిర్వాహక దేశం టోర్నమెంట్ నిర్వహించడం తమ వల్ల కాదని స్పష్టం చేసినా ఐసిసి మాత్రం ఇంకా ఏదో ఒక నిర్ణయానికి రావడం లేదు. ఎలాగైన టోర్నీని నిర్వహించాలని భావిస్తోంది. కానీ, పరిస్థితులు మాత్రం ప్రపంచకప్ నిర్వాహణకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఇలాంటి స్థితిలో ఐసిసి ఏదో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పటికే భారత్‌తో సహా చాలా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఈ విషయంలో ఐసిసి ఏదో ఒక ప్రకటన చేయాలని కోరుతున్నాయి. అయినా ఐసిసి మాత్రం అనిశ్చితి వాతావరణాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్న విషయం స్పష్టమవుతోంది. ఇదిలావుండగా కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియాలో మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అంతేగాక విదేశీయుల రాకపై ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో వరల్డ్‌కప్ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలవడం లేదు. దీంతో టోర్నీ నిర్వాహణకు సంబంధించి అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇక, త్వరలో జరిగే ఐసిసి సర్వసభ్య సమావేశంలో దీనిపై ఏదో ఒక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారైన ఐసిసి దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక, క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం వరల్డ్‌కప్ నిర్వాహణపై ఆశలు వదులుకొంది. దాని స్థానంలో ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇంగ్లండ్‌తో వన్డే, ట్వంటీ20 సిరీస్‌లు ఆడాలని భావిసతోంది. దీని కోసం ఇప్పటికే జట్లను కూడా ఎంపిక చేసింది.

ICC puts decision on T20 WC in Virtual Meeting on July 20

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News